Bosnia and Herzegovina….బోస్నియా మరియు హెర్జ్ గోవేనియా
ఒకప్పుడో బోస్నియా రోమన్ సామ్రాజ్యంలో భాగం. రోమన్ సామ్రాజ్య పతనం తరువాత బోస్నియాగా అవతరించింది. కానీ 1463 సంవత్సరంలో అట్టోమన్ల టర్కీలచే ఆక్రమించబడింది. వీరి తరువాత ఆస్టినా-హంగరీ తరువాత యుగోస్లోవియా లో భాగంగా ఉంది.
ఏప్రియల్ 5, 1992 సంవత్సరంలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Sarajevo . ఈ దేశ వైశాల్యం 51,129 చ.కి.మీ. వీరి భాషలు బోస్నియన్, క్రోయోసియా, సెర్బియన్. వీరి కరెన్సీ మార్కా. 40 శాతం ముస్లింలు, రోమన్ కేథలిక్స్ 15 శాతం మంది, ఆర్ధోడక్స్ 31 శాతం మంది ఇతర మతస్తులు 14 శాతం మంది ఉన్నారు.
గోధుమలు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు పండిస్తారు.
బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, సీసం, జింక్, కోబాల్ట, మాంగనీస్, నికెల్, జిప్సం, ఉప్పు, అడవులు సహజసందలు